హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

NTR: చందర్లపాడు నుంచి కంచల గ్రామానికి తుర్లపాడు మీదుగా వెళ్లే రహదారి పునఃనిర్మాణ పనులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.384.00 లక్షలు (రూ.3.84 కోట్లు) అంచనా వ్యయంతో ఈ రహదారి పునఃనిర్మాణ పనులు చేపట్టనున్నారు. గ్రామీణ ప్రజలు ప్రయాణించేందుకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందన్నారు.