హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పండుగ ఎఫెక్ట్.. మచిలీపట్నంలో రద్దీ

కృష్ణా: మచిలీపట్నంలో వినాయక చవితి పండుగ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగింది. పండుగకు అవసరమైన వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్లకు తరలివచ్చారు. దీంతో ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలు అధికమై ట్రాఫిక్ నెమ్మదిగా సాగింది. పలు ప్రాంతాల్లో వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.