హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లక్ష్యసాధనకు దిశానిర్దేశం'

విశాఖలోని డా. వి.ఎస్. కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘మిషన్ కృష్ణ’లో భాగంగా ‘ఇన్‌స్పైర్–2026’ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. జీఎస్‌టీ శాఖ సహాయ కమిషనర్ డి. రాంబాబు విద్యార్థులకు లక్ష్య నిర్దేశం, సమయపాలన, క్రమశిక్షణ, నిరంతర అధ్యయనంపై సూచనలు చేశారు. ప్రతిభ అన్వేషణ పరీక్షలో ర్యాంకులు సాధించిన 110 మందికి ఏకలవ్య పురస్కారాలు, నగదు బహుమతులు అందించారు.