హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిట్టపాలెంలో వానలు కురవాలని యాగం!

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెంలోని నారాయణస్వామి ఆలయంలో ఆదివారం వేద పండితుల ఆధ్వర్యంలో వరుణ యాగం ప్రారంభమైంది. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, తాగునీటి ఇబ్బందులు తొలగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని యాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నరసింహబాబు, ఛైర్మన్ చిన్న ఆదినారాయణ తెలిపారు.