హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పర్యావరణహిత చవితికి మట్టి విగ్రహాలే మేలు'

NTR: తిరువూరులో పర్యావరణహిత వినాయక చవితిని నిర్వహించాలని ఆర్డీవో ఏ.కుమార్ పిలుపునిచ్చారు. జియో పెట్రోల్ బంక్ నిర్వాహకులు కుందా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తిరువూరులో మట్టివినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటి కాలుష్యానికి కారణమవుతాయని, మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని పరిరక్షించి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించాలన్నారు.