హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి నేతల సమావేశం.. స్థానిక ఎన్నికలపై చర్చ

కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఉదయం కూటమి పార్టీల నేతల సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, ఎన్నికల ఇన్‌ఛార్జి సుజయ్‌ కృష్ణ రంగారావు తదితరులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మూడు పార్టీల మధ్య సమన్వయంపై ప్రధానంగా చర్చించారు.