అల్లూరి: జిల్లాలోని 212 స్వర్ణ గ్రామ సచివాలయాల్లో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లకు దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఆరు రోజుల్లో జిల్లాలో 10,541 మంది కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా హుకుంపేట మండలంలో 1,271 మంది, అత్యల్పంగా జి.మాడుగుల మండలంలో 809 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆరు రోజులు.. 10541 దరఖాస్తులు


