ప్రకాశం: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మర్రిపూడి ఎస్సై సుదర్శన్ యాదవ్ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ.. వినాయక విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జనం సందర్భంగా పోలీసుల సూచనలను ప్రజలు తప్పక పాటించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల సూచనలు పాటించాలి: SI


