హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హాస్పిటల్ వ్యర్థాలు వల్ల స్థానికులకు నరకయాతన!

NTR: తిరువూరు బోసుబొమ్మ సెంటర్‌లో హాస్పిటల్ వ్యర్థాల సమస్య స్థానికులకు నరకయాతన కలిగిస్తోంది. ఆసుపత్రుల నిర్వాహకులు వాడిపారేసిన వస్తువులను బహిరంగంగా వదిలేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దుర్వాసనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.