హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంజాబ్‌లో చదువుతున్న వరంగల్ విద్యార్థిని మృతి

WGL: ఉన్నత చదువుల కోసం పంజాబ్ వెళ్లిన పర్వతగిరి మండలం బూరుగుమళ్ల చెందిన బొబ్బల లక్ష్మీచంద్ర (20) ఫిట్స్ రావడంతో మృతి చెందింది. లవ్లీ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆమె ఈ నెల 10న కళాశాలలో మెట్లు దిగుతుండగా ఫిట్స్ వచ్చి కిందపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందింది. మృతదేహం నేడు స్వగ్రామనికి చేరుకుంది.