BHPL: విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డీఈ నాగరాజు సూచించారు. శనివారం కాటారం మండలం ధన్వాడ, గంగారం, తాడిచెర్ల విద్యుత్ ఉపకేంద్రాలను తనిఖీ చేసి లోడ్, వోల్టేజీ పరిస్థితులను పరిశీలించారు. సిబ్బంది భద్రతా ప్రమాణాలు పాటిస్తూ రక్షణ పరికరాలు వినియోగించాలని, వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందేలా అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ
విద్యుత్ అంతరాయాల నివారణకు చర్యలు


