హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాల పట్టివేత

JN: అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న ఒక హిటాచీ, నాలుగు టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం. బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను గుర్తించి పట్టుకున్నారు. తదుపరి చర్యల కోసం వాహనాలు, బాధ్యుల వివరాలను తహసీల్దార్‌కు పంపించినట్లు ఎస్సై తెలిపారు.