హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేలులో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

KDP: బద్వేలులోని నెల్లూరు రోడ్డులో ఉన్న శ్రీరాచపూడి నాగభూషణం డిగ్రీ కళాశాలలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు విద్యాసంస్థల ఏవో రాచపూడి వెంకటసాయికృష్ణ తెలిపారు. కడపకు చెందిన పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.