హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుదాఘాతంతో గేదె మృతి!

NLG: శాలిగౌరారం మండలంలోని తుడిమిడి గ్రామ సరిహద్దులో మూసీనది ఒడ్డున శనివారం విద్యుదాఘాతంతో గేదె మృతి చెందింది. అడ్డగూడూరు మండలం మానాయికుంటకు చెందిన యాదగిరి గేదెను మేపుతుండగా, తెగిపడి ఉన్న వ్యవసాయ మోటారు సర్వీస్ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ రూ.90 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరారు.