హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో జగన్‌కు చెక్ పెడతాం: ఎమ్మెల్యే

KDP: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ‘అభివృద్ధి–సంక్షేమం’ నినాదంతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. కడపలో కూటమి ముఖ్య నాయకుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్‌రెడ్డికి పులివెందులలోనే చెక్ పెడతామని పేర్కొన్నారు.