హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లిలో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

KDP: వేంపల్లిలో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో నిమజ్జన ఏర్పాట్లను సీఐ శనివారం నరసింహులు పరిశీలించారు. బీజేపీ నేత దొంతు సుమన్‌తో కలిసి నందిపల్లె చెరువు, నిమజ్జన ప్రాంతాలను సందర్శించారు. నిమజ్జన ట్రాక్టర్లు సులభంగా వెళ్లేందుకు మార్గం ఏర్పాటు చేయించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు.