హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు, రేపు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

BDK: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి మణుగూరు ఏరియా ఆధ్వర్యంలో 12 అంగుళాల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జీఎం దుర్గం రామచందర్ తెలిపారు. సెప్టెంబర్‌ 13, 14 తేదీల్లో నిర్ణయించిన ప్రదేశాల్లో విగ్రహాల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.