హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు గాంధీ మెడికల్ కాలేజ్ వ్యవస్థాపక దినం

HYD: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాల 72వ వసంతంలోకి అడుగుపెట్టింది. 1954 సెప్టెంబర్ 14న 'పీపుల్స్ మెడికల్ కాలేజీ'గా 40 మంది విద్యార్థులతో ప్రారంభమై,1958లో గాంధీ మెడికల్ కాలేజీగా మారింది. ఆదివారం అలుమ్నీ భవనంలో వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ చూపిన 44 మంది వైద్య విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నారు.