ప్రకాశం: గణేష్ మండపాల నిర్వాహకులకు జిల్లా ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు పలు సూచనలు చేశారు. విద్యుత్ లైన్ల కింద మండపాలు ఏర్పాటుచేయవద్దని స్పష్టం చేశారు. విద్యుత్ అలంకరణకు నాణ్యమైన తీగలు, సామగ్రి వినియోగించాలన్నారు. వైరింగ్ ఇతర పనులను అర్హత కలిగిన విద్యుత్ సిబ్బందితో చేయించుకోవాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ మండపాల నిర్వహకులకు విద్యుత్ శాఖ SE సూచనలు


