ASF: బెజ్జార్ మండలం కొత్తగూడెం శివారులో కోడి పందేల నిర్వహణపై పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్య, పీసీతో కలిసి దాడి నిర్వహించారు. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద మూడు కోళ్లు, రెండు కత్తులు, రూ. 600 నగదు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
కోడి పందేల స్తావరాలపై పోలీసుల దాడి..!


