MNCL: జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన తోంగూరి రవికుమార్ కుమారుడు శ్రీరామ్ పై శనివారం సాయంత్రం వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడి చెవి, చేయి, చెంపపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని చికిత్స కోసం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తండ్రి రవికుమార్ తెలిపారు.
తెలంగాణ
వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్రగాయాలు


