హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గొల్లగూడెంలో కలుషిత నీటి సరఫరా..!

సంగారెడ్డి: జిల్లా కేంద్రంలోని గొల్లగూడెం శివారులో పైప్‌లైన్ లీకేజీతో నెలల తరబడి తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. లీకేజీ నీటిలో మురుగు చేరి కలుషిత నీరు వస్తోందని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్ లీకేజీకి మరమ్మతులు చేపట్టి, మంచినీటి సమస్యను తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.