హైదరాబాద్: 28°C
తెలంగాణ

అల్లర్లు వద్దు-భక్తిశ్రద్ధలే ముద్దు: ఎస్సై

KMR: దేవునిపల్లిలో ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని శనివారం రాత్రి ఎస్సై రంజిత్ సూచించారు. గ్రామ పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండపాల వద్ద అల్లర్లకు తావివ్వకుండా భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలన్నారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, డీజేలు ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు.