హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు..!

SRCL: వేములవాడ మండలం హన్మక్కపల్లె సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో నాంపల్లికి చెందిన జడల సత్తయ్య (48) గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. ఈఎంటీ ప్రవీణ్, పైలట్ లక్ష్మయ్య ఘటనాస్థలికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి, వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సత్తయ్య కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.