KNR: ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలో ఎస్ఐఆర్ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆర్డీవో జలకుమారి పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటర్ల జాబితా పరిశీలన, ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహణ తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సర్పంచ్ గుత్తికొండ రమ్య ఆర్డీవోను సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మనోజ్, ఏఎస్ఐ పాల్గొన్నారు.
తెలంగాణ
పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో


