హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోదావరి పుష్కర ఘాట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాట్లు: SI

E.G: రానున్న గోదావరి పుష్కరాల్లో యాత్రికుల భద్రత కోసం ఘాట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీతానగరం SI ఎల్. శ్రీనివాస్ నాయక్ శనివారం తెలిపారు. జిల్లా SP నరసింహ కిషోర్, కోరుకొండ నార్త్ జోన్ DSP జి. జీవన్ ఆదేశాల మేరకు మండల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు బందోబస్తు కల్పిస్తామన్నారు.