హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నంలో దోమల నివారణకు చర్యలు

కృష్ణా: మచిలీపట్నం 19వ వార్డు వైఎస్‌ఆర్ కాలనీలో శనివారం దోమల నివారణ చర్యల్లో భాగంగా స్ప్రేయింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని నివాస ప్రాంతాల్లో దోమల నియంత్రణకు అవసరమైన రసాయనాలను పిచికారీ చేశారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ సూపర్‌వైజర్ సూరిబాబు సూచించారు.