NTR: విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కొండ ప్రాంతాలు, కాలువ గట్లపై నివసిస్తున్న ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆయా ప్రాంతాల్లో నిరంతరం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ దామోదర్ తెలిపారు. మొగల్రాజపురం, రామవరప్పాడు, ఎనికెపాడు తదితర ప్రాంతాల్లో పోలీసులు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షాలతో అప్రమత్తమైన పోలీసులు


