హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళపై కర్రతో దాడి

ప్రకాశం: గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ విఠాముసురుపల్లికి చెందిన కాశమ్మ అనే మహిళ శనివారం పొలానికి వెళ్తుండగా నాయుడు అనే యువకుడు ఆమెను అడ్డుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఈ దారిలో వెళ్లేందుకు వీల్లేదంటూ ఆమెతో గొడవపడి కర్రతో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన కాశమ్మను కుటుంబ సభ్యులు గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.