ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచొ వచ్చిన భక్తులు 108 ప్రదక్షిణాలు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం వరకు ఆలయానికి వివిధ సేవల రూపంలో రూ.1,90,456 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మద్ది అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు


