హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి'

AKP: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. నక్కపల్లిలోని తన నివాసం వద్ద శనివారం టీడీపీ సమన్వయ కమిటీ, క్లస్టర్, యూనిట్ సభ్యులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తమై ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.