హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

77 పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్

ASR: చింతపల్లి మండలంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 77 పోలింగ్ కేంద్రాలను మ్యాపింగ్ చేశామని ఎంపీడీవో లాలం సీతయ్య శనివారం తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన పూర్తయిందన్నారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను ఈనెల 15న ప్రచురిస్తామని, 15, 16 తేదీల్లో సూచనలు, సలహాలు స్వీకరిస్తామని చెప్పారు. 16న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.