హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎయిర్ పోర్ట్‌కు క్యాబ్ సేవలు బంద్

RR: శంషాబాద్ RGI విమానాశ్రయానికి క్యాబ్ సేవలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) ప్రకటించింది. కనీస ఛార్జీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు ఎయిర్ పోర్ట్ ట్రిప్పులను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. సమస్యల పరిష్కారానికి GMR, RGIA, క్యాబ్ సంస్థలతో సమావేశం నిర్వహించాలని యూనియన్ కోరింది.