హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం షాపుల లైసెన్సులకు కొత్త పాలసీ

ASR: 2026-27 ఎక్సైజ్ సంవత్సరానికి A-4 మద్యం దుకాణాల లైసెన్సుల పునరుద్ధరణకు ప్రభుత్వం నూతన పాలసీ ప్రకటించింది. 2025-26లో అమల్లో ఉన్న వార్షిక RET రేట్లే కొనసాగనున్నాయి. ప్రస్తుత లైసెన్సుదారులు RETపై అదనంగా 38% రెన్యూవల్ RET చెల్లించి లైసెన్సులు పునరుద్ధరించుకోవచ్చు. అల్లూరి జిల్లాలో 21 ఓపెన్ కేటగిరీ షాపులకు ఈనెల 21వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు.