HYD: నగరంలో దారుణం చోటు చేసుకుంది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సమీపంలో ఓ జంట బైక్‌పై ఫ్రీ లెఫ్ట్‌లో వెళ్తున్న సమయంలో కారు అద్దాన్ని తాకారని ఓ వ్యక్తి వెంబడించి మరీ ఢీ కొట్టాడు. దీంతో వారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
కారు అద్దాన్ని తాకారని వెంబడించి మరీ..!


