హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమతుల ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం'

W.G: అన్ని పోషకాలతో కూడిన సమతుల ఆహారంతో ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని ICDS సూపర్‌వైజర్ కె.విశాలాక్షి అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం 21వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార అవగాహన సదస్సు జరిగింది. చిరుధాన్యాల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుందని, గర్భిణులు వీటిని నిత్యం ఆహారంలో తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ANM పోశమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.