హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ ఉపాధ్యాయినికి ఎమ్మెల్యే సత్కారం

కృష్ణా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు గ్రహీత వేమూరి నాగలక్ష్మి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు. అవనిగడ్డ శివారు కొత్తపేటకు చెందిన నాగలక్ష్మి మొవ్వ మండలం కోసూరు ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయినిగా అత్యుత్తమ విద్యాబోధన ద్వారా ఇటీవల గురు పూజోత్సవ వేడుకల్లో జిల్లా స్థాయి బెటర్ టీచర్ అవార్డు అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే సత్కరించారు.