హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ కింద పడి డ్రైవర్ మృతి

అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం చిన్నవారంపాడు బ్రిడ్జి సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ నుంచి కిందకు దూకిన డ్రైవర్ బి.మురళిపై అదే లారీ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు తాడిపత్రి గ్రామానికి చెందినవారని ఎస్సై సుజన్ కుమార్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.