హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి'

BHNG: కూరెళ్ల గ్రామంలో సీపీఎం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రెండో వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీపీఎం మండల కార్యదర్శి వేముల భిక్షం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ, పేదలు, కార్మికుల హక్కుల కోసం ఏచూరి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అన్నారు.