హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయక విగ్రహాలనే వినియోగించాలి: కలెక్టర్

విజయనగరం జిల్లా ప్రజలు ఈ ఏడాది వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP), రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించకుండా జలవనరులను పరిరక్షించాలని కోరారు.