హైదరాబాద్: 28°C
తెలంగాణ

విదేశీ ఒప్పందాలు రద్దు చేయాలి: AIKMS

KMM: వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే విదేశీ ఒప్పందాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని AIKMS రాష్ట్ర నాయకుడు బండారి ఐలయ్య డిమాండ్‌ చేశారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో నిర్వహించనున్న జాతీయ సభల పోస్టర్లను శనివారం ఆయన ఖమ్మంలో ఆవిష్కరించారు. ఉపాధిహామీ పనిదినాలను 200 రోజులకు పెంచాలని, రైతు ఉద్యమ హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు.