గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని తుర్కపల్లి మండల ఎస్సై శివకృష్ణ సూచించారు. తెలంగాణ పోలీస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా, విద్యుత్, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీసులకు సహకరించాలని తెలిపారు.
తెలంగాణ
గణేశ్ ఉత్సవాలపై పోలీసుల సూచనలు


