SRCL: గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని పట్టణ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ సూచించారు. ఇవాళ సిరిసిల్ల గాజుల మల్లయ్య ఫంక్షన్‌హాల్‌లో మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ, శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మండపాల ఏర్పాటు, సౌండ్ సిస్టమ్ వినియోగంలో నిబంధనలు పాటించాలని తెలిపారు. నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు పాటించాలని సూచించారు.
తెలంగాణ
'ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి'


