హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దంచి కొట్టిన వర్షం

NGKL: కల్వకుర్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా, మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొట్టింది. ఈ వర్షంతో పంటలకు ఊతమిస్తుందని భావిస్తున్న రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.