హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణా పై ప్రత్యేక నిఘా : SI

BHPL: రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి శివారులోని మానేరు వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దమ్మన్నపేటకు చెందిన కొండమల్ల సురేందర్‌పై కేసు నమోదు చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై నిఘా కొనసాగుతోందని ఎస్సై డి. సుధాకర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.