హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మాణ పనులు ప్రారంభించిన సర్పంచ్

NRPT: నర్వ మండలం శ్రీపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ చంద్రశేఖర్ శనివారం ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని, రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.