హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయంలో ధ్వజస్తంభ కలశ స్థాపన

ATP: అనంతపురం కృష్ణ కళామందిరంలోని శ్రీశ్రీశ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ, ప్రధాన కలశ స్థాపన మహోత్సవంలో జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో డీఆర్‌వో ఏ. మలోలతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. తొలి రోజు గణపతి పూజ, కలశస్థాపన, మంగళహారతి నిర్వహించారు.