హైదరాబాద్: 28°C
తెలంగాణ

డంపింగ్ యార్డ్‌తో తీవ్ర ఇబ్బందులు

MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని వీరన్నపేట డంపింగ్ యార్డ్ సమస్యపై స్థానికులు శనివారం తీవ్ర నిరసన తెలిపారు. డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న దుర్వాసన, పొగ కారణంగా తాము తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుర్వాసనతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోందని వాపోయారు. డంపింగ్ యార్డ్‌ని వేరే చోటకి మార్చాలని కోరారు.