ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌లో రైతు సోదరులకు మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి భోజనాలు వడ్డించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో రైతులతో కలసి ఆమె భోజనం చేశారు. రైతుల సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తామని, వారి అవసరాలను గుర్తించి తగిన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నాయకులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులతో కలిసి భోజనం చేసిన చైర్‌పర్సన్


