హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీబీ రోగులకు ఉచితంగా ఆహార సరుకుల పంపిణీ

KNR: మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఆహార సరుకులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సతీమణి డా. కవ్వంపల్లి అనురాధ ఈ కార్యక్రమంలో పాల్గొని రోగులకు సరుకులు అందజేశారు. టీబీ బాధితులకు పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడాలని ఆమె సూచించారు.